Flash Flood Alert : తెలంగాణలో పది జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో పది జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో పది జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి.. కామారెడ్డి, కొమురంభీం, మెదక్, నిర్మల్,నిజామాబాద్.. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశముందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, తెలంగాణలోని ఇరవై ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలో నాలుగు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఉత్తర,దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.