Telangana : నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికలను నిర్వహించడంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం కొంత సమయం ఇవ్వడంతో ఈ నెల 24వ తేదీ వరకూ ఇచ్చింది. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు వెలువరించనుంది. ఇప్పటీకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని న్యాయస్థానానికి ఈరోజు వెల్లడించనుంది.
ఈరోజు విచారణలో...
రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి లేఖ అందిన వెంటనే తాము స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ న్యాయస్థానానికి తెలిపింది. ఈ రోజు విచారణలో ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమయింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు గతంలో మాదిరిగానే ఉంచి స్థానిక సంస్థల ఎన్నిలకు వెళతామని ప్రభుత్వం చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.