Telangana : సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిగా హనుమంతరావు

తెలంగాణ సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌గా ఎం. హనుమంతరావు బాధ్యతలను చేపట్టారు

Update: 2024-02-05 14:15 GMT

తెలంగాణ సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌గా ఎం. హనుమంతరావు బాధ్యతలను చేపట్టారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ సమాచార్ భవన్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అశోక్ రెడ్డి హార్టికల్చర్ డైరెక్టర్ గా బదిలీ పై వెళ్లడంతో ఆయన స్థానంలో కమిషనర్‌గా హనుమంత రావును ప్రభుత్వం నియమించింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన కమిషనర్‌ ఆ శాఖ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలను అడిగి ఆయన తెలుసుకున్నారు.

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను...
ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో ప్రచారం చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహిస్తుందని, అధికారులు అందుకు అణుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. సచివాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు.కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎఫ్‌డీసీ కిషోర్‌బాబు, అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య కాంబ్లే, జాయింట్‌ డైరెక్టర్లు జగన్‌, వెంకట్‌ రమణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్‌, సీఐఈ రాధాకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News