Telangana : సర్పంచ్ పదవి పోటీకి పదమూడు కీలకమైన విషయాలివే
తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు వచ్చే నెల 11వ తేదీన జరగనున్నాయి
తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు వచ్చే నెల 11వ తేదీన జరగనున్నాయి. ఈరోజు నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. సర్పంచ్ అంటే ఆ పంచాయతీకి రారాజు అని చెప్పాలి. ఆయనే ఆ పంచాయతీకి ముఖ్యమంత్రి.. మంత్రి. అందుకే సర్పంచ్ పదవికి గ్రామాల్లో తీవ్రంగా పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసేవారు ఏ ఏ పత్రాలను సిద్ధంచేసుకోవాలన్నది అధికారులు ముందుగానే నిర్ణయించారు.
పోటీ చేయాలనుకునే వారు...
సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 1)కుల ధృవీకరణ పత్రం, 2) ఆదాయ ధృవీకరణ పత్రం,3) నివాస ధృవీకరణ పత్రం, 4) ఎన్ఓసి, 5) ఆధార్ కార్డు, 6) పాన్ కార్డు, 7) బ్యాంక్ అకౌంట్, 8) నూతన పాస్ పోర్టు సైజ్ ఫోటోలు, 9) ఓటర్ ఐడీ కార్డు, 10) ఎటువంటి బ్యాంక్ లావాదేవీలు పిండింగ్ లో లేవని ఆధారం, 11) ఆస్తుల వివరాలు, 12) రేషన్ కార్డు, 13) ఇతరత్రా కేసులు వివరాలు తెలియాల్సి ఉంటుంది