బిల్లులు తిప్పి పంపడం నా ఉద్దేశం కాదు: గవర్నర్‌ తమిళిసై

నిన్నటి తెలంగాణ కేబినెట్‌ సమావేశం అనంతరం.. ముఖ్యమైన బిల్లుల విషయమై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు.

Update: 2023-08-01 10:28 GMT

నిన్నటి తెలంగాణ కేబినెట్‌ సమావేశం అనంతరం.. ముఖ్యమైన బిల్లుల విషయమై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తాజాగా గవర్నర్ ఖండించారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో వివరించారు. తాను ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పారు. బిల్లులను వెనక్కి పంపడం తన ఉద్దేశం కాదని తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న బాధలను గుర్తు చేసుకున్న తమిళిసై, త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. వర్షాల వల్ల ప్రజలు పడిన ఇబ్బందులు తనకు ఎంతగానో బాధను కలిగించాయని అన్నారు.

వరదల్లో చిక్కుకున్న ప్రజలను చూస్తుంటే బాధేస్తోందని అన్నారు. రాష్ట్రంలో వరద ప్రభావంతో జరిగిన నష్టంపై ప్రభుత్వం నుంచి రిపోర్ట్‌ అడిగానని, అది రాగానే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానని తమిళిసై స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం మరింత రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నీట మునిగిన ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. వర్షాలపై కొన్ని పార్టీలు మెమోరాండం ఇచ్చాయని.. ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆదేశించారు. దీంతో పాటు బిల్లులు ఎందుకు తిరస్కరించానో కారణాలు చెప్పానని గవర్నర్‌ తమిళిసై తెలిపారు.

బిల్లులను తిప్పి పంపడం తన ఉద్దేశం కాదని తెలిపారు. మరోవైపు వరద బాధిత ప్రాంతాల్లో పునరావస చర్యలపై వేగంగా జరగట్లేదని కాంగ్రెస్‌ నాయకులు గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. రాజ్​భవన్​లో సీఎల్పీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతలు.. గవర్నర్​తో సమావేశమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ తీరు వల్లే వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి, సహాయక చర్యలు వేగవంతం చేయాలని వారు గవర్నర్‌ని కోరారు. గతంలో గవర్నర్​ పలుమార్లు సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పర్యటనలు చేపట్టారు. 

Tags:    

Similar News