ఆర్టీసీ కార్మిక సంఘాలతో నేడు చర్చలు
ఆర్టీసీ కార్మిక సంఘాలతో నేడు నేడు ప్రభుత్వం చర్చలు జరపనుంది
ఆర్టీసీ కార్మిక సంఘాలతో నేడు నేడు ప్రభుత్వం చర్చలు జరపనుంది. రేపటి నుంచి తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాల నేతలతో చర్చించనున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కార్మిక సంఘాలు కూడా చర్చలకు రావడానికి అంగీకరించాయి.
దశల వారీగా ఉద్యమం...
అదేసమయంలో రేపటి నుంచి దశల వారీగా సమ్మెకు దిగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా చర్చలు జరపడానికి సిద్ధమయింది. ఈరోజు కార్మిక సంఘాలతో జరిగే చర్చల్లో సీపీఎం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావుకూడా పాల్గొననున్నారు. చర్చలు ఫలప్రదం అవుతాయని భావిస్తున్నారు. నగదుతో సంబంధం లేని కొన్ని సమస్యలను పరిష్కరించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.