Telangana : నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది

Update: 2025-11-24 04:10 GMT

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాల్లో నేడు కలెక్టర్లు రిజర్వేషన్లపై గెజిట్‌ నోటిఫికేషన్ల జారీ చేయనున్నారు. హైకోర్టు విచారణ తర్వాత షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల కమిటీ ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ప్రాధమికంగా సమాచారాన్ని అందించారు.

రేపటి కేబినెట్ సమావేశంలో...
రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షనత జరిగే కేబినెట్‌ సమావేశంలో ఎన్నికల తేదీలు ఖరారు అవుతున్నారు. అన్ని జిల్లాల గెజిట్ సమాచారాన్ని ఎస్‌ఈసీకి పంచాయతీరాజ్‌ శాఖ పంపనుంది. దీని తర్వాత షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతా అనుకూలిస్తే ఈ నెల 26, 27 తేదీ ల్లో షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News