Telangana : మహిళలకు గుడ్ న్యూస్ .. కోటి మంది మహిళలకు నేడు చీరల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమయింది
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమయింది. నేడు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందిరామహిళ శక్తి చీరలను పంపిణీ చేయనున్నారు. దాదాపు కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నేడు నెక్లెస్ రోడ్డులో...
నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నార. నెక్లెస్ రోడ్డులో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుననారు. నేటి నుంచి డిసెంబరు 9వ తేదీ వరకూ ఇందిరమ్మ చీరల పంపిణీ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.