ఎమ్మెల్సీ కి కరోనా పాజిటివ్

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.

Update: 2022-01-09 04:38 GMT

కరోనా థర్డ్ వేవ్ ఎవరినీ వదలడం లేదు. ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు సయితం కోవిడ్ బారిన పడుతున్నారు. మాస్క్ ధరించకుండానే ప్రజల దగ్గరకు వెళుతుండటంతో ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.

హోం ఐసొలేషన్ లో.....
ఆయన ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని పట్నం మహేందర్ రెడ్డి సూచించారు. తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు.


Tags:    

Similar News