కుట్ర వెనక మోదీ, చంద్రబాబు : మాజీ మంత్రి సంచలన ఆరోపణలు
కేసీఆర్ ను రాజకీయంగా అణిచి వేయడానికి పెద్దయెత్తున కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు
కేసీఆర్ ను రాజకీయంగా అణిచి వేయడానికి పెద్దయెత్తున కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు జరుగుతున్న కుట్రల వెనక మోదీ, చంద్రబాబు ఉన్నారని అన్నారు. మోదీ, చంద్రబాబు నాయుడులు రేవంత్ రెడ్డితో కలసి ఈ రకమైన కుట్రకు తెరలేపారని, చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ మరొకసారి అధికారంలోకి వస్తే...
కేసీఆర్ మరొకసారి అధికారంలోకి వస్తే ఈసారి ఢిల్లీ స్థాయిలో రాజకీయం చేస్తారని భావించి, మోడీ, చంద్రబాబు చేసిన కుట్రల్లో భాగంగానే ఈ పరిణామాలు అని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఎవరు చెబితే ఇలా చేస్తున్నారో అందరికీ తెలుసునని అన్నారు. కుటుంబ సభ్యుల్లో చీలిక తేవడం వెనక కూడా వీరే ఉండి ఉంటారన్న బలమైన కారణం తనకు ఉందని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.