Breaking : గాలి జనార్థన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే కొన్ని షరతులను తెలంగాణ న్యాయస్థానం విధించింది. దేశం విడిచి ఎక్కడకూ వెళ్లకూడదని ఆదేశించింది.
షరతులతో కూడిన...
పాస్ పోర్టులను సరెండర్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కోర్టు విధించిన తీర్పు పై స్టే విధించిన హైకోర్టు పది లక్షల రూపాయలతో కూడిన రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశిందచింది. ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్థన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్లు శిక్ష విధించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.