Telangana : గ్రామాల్లో ఎన్నికల కోలాహలం..తొలిరోజు నామినేషన్లు ఏన్నంటే?

తెలంగాణలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది.

Update: 2025-11-28 04:35 GMT

తెలంగాణలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. నిన్నటి నుంచి మొదటి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. తొలి దశ ఎన్నికలు వచ్చే నెల 11వ తేదీన జరగనున్నాయి. ఇప్పటికే కొందరు నామినేషన్ల కోసం శుభముహూర్తాలు చూసుకుంటున్నారు.

తొలిరోజున నామినేషన్లు...
తొలిదశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటిరోజు 5,063 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పచ్ పదవులకు 3,243..వార్డులకు 1,821 నామినేషన్లు దాఖలయినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు శుక్రవారం ఇంకా ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. అయితే చాలా చోట్ల సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.


Tags:    

Similar News