నిన్నటి వరకూ లేని నీళ్లు నేడు ఎక్కడి నుంచి వచ్చాయి?

కేసీఆర్ వల్లనే నిన్న వరద కాల్వకు ప్రభుత్వం నీటిని విడుదల చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు

Update: 2024-04-02 08:17 GMT

కేసీఆర్ వల్లనే నిన్న వరద కాల్వకు ప్రభుత్వం నీటిని విడుదల చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పొలంబాట పట్టిన కారణంతోనే ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. నిన్నటి వరకూ లేని నీళ్లు నేడు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. సాగర్ ఎడమకాల్వకు నీళ్లు వదిలారంటే అది కేసీఆర్ నల్గొండలో చేసిన పర్యటన వల్లనే సాధ్యమయిందన్నారు. తాజాగా కరీంనగర్ కు వస్తున్నారని తెలిసి ఎస్సారెస్సీ కాల్వకు నీళ్లు విడుదల చేశారని హరీశ్ రావు అన్నారు.

పరిహారం ఇవ్వాల్సిందే...
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. పంటకు బోనస్ గా ఐదు వందల రూపాయలు ఇవ్వాలని కూడా ఆయన అన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ హామీలను వెంటనే అమలు చేసి రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకోవాని హరీశ్ రావు కోరారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందన్నారు. ముఖ్యంగా నీటిపారుదల, విద్యుత్తు రంగాల్లో ప్రభుత్వ వైఫల్యం కంటికి కనిపిస్తున్నా ఇంకా కప్పిపుచ్చుకునేలా మంత్రులు మాట్లాడుతున్నారన్నారు.


Tags:    

Similar News