Revanth Reddy : అధికారులపై రేవంత్ సీరియస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం చూపితే తీవ్ర చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలులో అలసత్వానికి తావులేదని స్పష్టం చేశారు. శనివారం ఆయన నివాసంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, సీఎంఓ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రెండేళ్లు పూర్తయినా...
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కొంతమంది అధికారులు పాత విధానాలనే కొనసాగిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.