టి.కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు
abhishek manu singhvi, rajya sabha, congress, telangana
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. షబ్బీర్ అలి, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి, రేణుకా చౌదరి, అంజన్ కుమార్ యాదవ్ లకు నోటీసులు జారీ అయినట్లు చెబుతున్నారు. వచ్చే నెల 10వ తేదీన ఢిల్లీలో ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
డొనేషన్ ఇచ్చారని....
అయితే తాను నేషనల్ హెరాల్డ్ కు డొనేషన్ ఇచ్చిన మాట వాస్తవమేని షబ్బీర్ అలి తెలిపారు. కానీ ఇంతవరకూ తనకు ఎటువంటి నోటీసులు అందలేదని ఆయన పేర్కొన్నారు. నోటీసులు వస్తే ఖచ్చితంగా హాజరవుతానని తెలిపారు. అయితే మిగిలిన నేతలకు నోటీసులు ఈడీ నుంచి అందాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.