కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్

ఎన్నికల కమిషన్ కొత్త రేషన్ కార్డులకు బ్రేక్ వేసింది. మీ సేవలో దరఖాస్తులను నిలిపేయాలని ఆదేశించింది

Update: 2025-02-08 12:54 GMT

ఎన్నికల కమిషన్ కొత్త రేషన్ కార్డులకు బ్రేక్ వేసింది. మీ సేవలో దరఖాస్తులను నిలిపేయాలని ఆదేశించింది. మీ సేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి కూడా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల కోడ్ కారణంగా...
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంతో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను నిలిపేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దరఖాస్తులను మీ సేవ కేంద్రాల ద్వారా చేసుకుంటే అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని, అలాగే మార్పలు, చేర్పులు చేస్తామన్న ప్రకటన ఓటర్లను మభ్యపెట్టే విధంగా ఉందని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. అందుకే నిలుపుదల చేసింది.


Tags:    

Similar News