రెండో రోజు దావోస్ లో రేవంత్ టీం?
దావోస్ పర్యటనలో రేవంత్ బృందం పలు సంస్థలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశం కానుంది
దావోస్ పర్యటనలో రేవంత్ బృందం పలు సంస్థలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశం కానుంది. రెండో రోజు దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి బృందం వివిధ సంస్థలకు చెందిన సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి చర్చించనుంది. ఇక్కడ ఉండే అవకాశాలతో పాటు రాయితీలను కూడా వివరించనుంది.
తెలంగాణ పెవిలియన్ ను...
మరోవైపు దావోస్ లో ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి పెవిలియన్ అక్కడ ప్రారంభించింది. అక్కడకు చేరుకునే పారిశ్రామికవేత్తలతో రేవంత్ రెడ్డి సమావేశమై వారికి తమ ప్రాధాన్యతలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ పెవిలియన్ లో కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జయంతి చౌదరిలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అనేక అంశాలపై చర్చించారు.