నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ పండగ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం ఇచ్చే చీరల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది.

Update: 2022-09-22 03:07 GMT

బతుకమ్మ పండగ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం ఇచ్చే చీరల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి దసరా పండగకు తెలంగాణ ప్రభుత్వం పేదింటి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సిరిసిల్లలో చీరలు తయారు చేయించి సిద్ధం చేశారు. నేటి నుంచి చీరలను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

కోటి మందికి...
మొత్తం 24 రకాలు డిజైన్లు, పది ఆకర్షణీయమైన రంగులతో 240 రకాల చీరలను తెలంగాణ ప్రభుత్వం తయారు చేయించింది. ఇందుకోసం 339 కోట్ల రూపాయలను వెచ్చించింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పేద మహిళలకు బతుమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. కోటి మంది మహిళలకు ఈ చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి.


Tags:    

Similar News