నేడు తెలంగాణ జాగృతి మహా ధర్నా
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా జరగనుంది
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ మహాధర్నా జరుగుతుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం చెబుతూ ఈ ధర్నా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు.
కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని...
ఈ మహా ధర్నాలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు సమకూరిన ప్రయోజనం, ఎన్ని వేల ఎకరాలకు సాగు నీరు అందిందీ మేధావులు, నీటిపారుదల రంగ నిపుణులు ఈ ధర్నా కార్యక్రమంలో వివరించనున్నారు. కేవలం రాజకీయ కక్షతోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటూ కల్వకుంట్ల కవిత ఈ మహాధర్నాకు నేడు శ్రీకారం చుట్టారు. దీంతో ఇందిరాపార్కు వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.