నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం

భారత రాష్ట్ర సమితి కీలక సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు

Update: 2023-03-10 03:24 GMT

భారత రాష్ట్ర సమితి కీలక సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు. తెలంగాణ భవన్ లో జరగనున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హాజరు కానున్నారు. భవిష‌్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కేసీఆర్ నేతలతో చర్చించనున్నారు.

రానున్న ఎన్నికలపై...
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టడంపైన కూడా చర్చ జరగనుంది. పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేతలకు భరోసా ఇవ్వనున్నారు. వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సి వ్యూహాలను కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. ఈ ఏడాది చివరలో ఎన్నికలు ఉండటంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags:    

Similar News