ఆసుపత్రుల్లో కరోనా కలకలం... మహమ్మారి బారిన వైద్యులు

కరోనా వైరస్ థర్డ్ వేవ్ లో ఎవరనీ వదలడం లేదు. అత్యంత జాగ్రత్తలు పాటించే వైద్యులు సయితం కరోనా బారిన పడుతున్నారు.

Update: 2022-01-10 03:03 GMT

కరోనా వైరస్ థర్డ్ వేవ్ లో ఎవరనీ వదలడం లేదు. అత్యంత జాగ్రత్తలు పాటించే వైద్యులు సయితం కరోనా బారిన పడుతున్నారు. వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్ తో పాటు 20 మంది మెడికోలు కరోనా బారిన పడ్డారు. దీంతో కాకతీయ మెడికల్ కళాశాలలో సిబ్బంది, వైద్యులు అప్రమత్తమయ్యారు. మిగిలిన వారు కూడా వైద్య పరీక్సలు చేయించుకుంటున్నారు.

ఉస్మానియా ఆసుపత్రిలో....
అలాగే హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో కూడా కరోనా కలకలం రేగింది. 11 మంది హౌస్ సర్జన్లకు కరోనా పాజిటివ్ గా తేలింది. వీరికి గత రెండు రోజులుగా స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. మిగిలిన వారు కూడా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.


Tags:    

Similar News