పెరుగుతున్న కేసులు.. సెలవుల పొడిగింపు?

తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. ఒక్కరోజులోనే 1,963 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు.

Update: 2022-01-16 02:36 GMT

తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. ఒక్కరోజులోనే 1,963 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,07,162 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,81,091 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 22,017 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,054 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా 1,075 కేసులు నమోదయ్యాయి. సంక్రాంతి పండగ తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. తెలంగాణలో పాఠశాలలకు ఈ నెల 17వ తేదీ వరకూ సెలవులు ప్రకటించారు. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా వీటిని పొడిగించే అవకాశముంది. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించే అవకాశముంది. దీనిపై ఈరోజు అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశముంది.


Tags:    

Similar News