తెలంగాణలో పెరుగుతున్న కేసులు... సెలవులను పొడిగించే?

తెలంగాణలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 2,319 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు.

Update: 2022-01-13 04:01 GMT

తెలంగాణలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 2,319 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ7.00,031 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,78,466 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రోజుకు కేసులు రెండు వేలు దాటడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.

సంక్రాంతి సెలవులను....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 18,339 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,043 మంది కరోనా కారణంగా మరణించారు. సంక్రాంతి పండగ తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతుంది. హైదరాబాద్ పరిధిలో 1,042 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల17వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సెలవులను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది. సమీక్ష తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.


Tags:    

Similar News