తెలంగాణలో కరోనా కల్లోలం.. కోవిడ్ అప్ డేట్

తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈరోజు కొత్తగా 4,416 కేసులు నమోదయ్యాయి.

Update: 2022-01-21 14:47 GMT

తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈరోజు కొత్తగా 4,416 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,26,819 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,93,623 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

30 వేలకు చేరువలో....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 29,127 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,069 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,670 కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News