పెరుగుతున్న యాక్టివ్ కేసులు.. జాగ్రత్తగా లేకుంటే?

తెలంగాణలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 2,707 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు

Update: 2022-01-14 01:43 GMT

తెలంగాణలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 2,707 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,02,801 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,78,290 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రోజుకు కేసులు రెండు వేలు దాటడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.

మరణాలు....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 20,462 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,049 మంది కరోనా కారణంగా మరణించారు. హైదరాబాద్ పరిధిలో 1,328 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3,04,52,039 రక్తనమూనాలను పరీక్షించారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపిింది.


Tags:    

Similar News