తెలంగాణలో కరోనా అప్ డేట్
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా 2,850 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా 2,850 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,64,911 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,23,654 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 35,625 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,091 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.