ఆ రెండు పార్టీలకు రేవంత్ ఛాలెంజ్

వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇందిరాపార్క్ వద్ద రెండోరోజు దీక్ష కొనసాగుతుంది.

Update: 2021-11-28 08:45 GMT

వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇందిరాపార్క్ వద్ద రెండోరోజు దీక్ష కొనసాగుతుంది. నిన్న ప్రారంభమైన ధర్నానేటి సాయంత్రంతో ముగియనుంది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకూ వర్షాకాలం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదన్నారు.

కల్లాల దగ్గరకు ....
దానిని కొనుగోలు చేయకుండా యాసంగి పంట మీద కేసీఆర్ డ్రామాలను ప్రారంభించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధైర్యముంటే టీఆర్ఎస్, బీజేపీ నేతలు కల్లాల దగ్గరకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నుంచి తాము వస్తామని, కల్లాల దగ్గర రైతులు ఎవరిని చెప్పులతో కొడతారో చూద్దామని రేవంత్ ఛాలెంజ్ చేశారు.


Tags:    

Similar News