నేడు మీనాక్షితో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ

నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర వ్యవహారా ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ తో సమావేశం కానున్నారు

Update: 2025-05-28 05:48 GMT

నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర వ్యవహారా ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ తో సమావేశం కానున్నారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొంటారు. త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో మాదిగలకు అవకాశం కల్పించాలని కోరనున్నారు. మంత్రి వర్గ విస్తరణలో మాదిగలకు అవకాశం కల్పిస్తేనే న్యాయం జరగనుందని వారు తెలపనున్నారు.

మంత్రి వర్గ విస్తరణలో...
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం ఊపందుకున్న వేళ వరసగా ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. ఆశావహులందరూ ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ మొదలు పెట్టారు. తమకు పరిచయం ఉన్న కేంద్ర నాయకులతో సమావేశమై వారితో తమకు అవకాశం కల్పించాలని కోరనున్నారు. ఇందులో భాగంగనే మీనాక్షి నటరాజన్ ను నేడు మాదిగ సామాజికవర్గం నేతలు కలవనున్నారు.


Tags:    

Similar News