Telangana : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వసూళ్ల దందా వీడియో కలకలం
తెలంగాణాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వసూళ్ల దందా బయటకు వచ్చింది. వీడియో వైరల్ అయింది
తెలంగాణాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వసూళ్ల దందా బయటకు వచ్చింది. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ మామూళ్ళ వసూలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో ఎమ్మెల్యే నేరుగా కనిపించకపోయినా ఆయన ఆడియో రావడం కలకలం రేపింది. వైన్స్ యజమానులతో ఎమ్మెల్యే శామ్యూల్డబ్బులు డిమాండ్ చేస్తున్న మందుల సామెల్ వీడియో ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతుంది.
కోట్లు ఖర్చుపెట్టానంటూ...
ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టానని, రికవరీ కావాలంటేమళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని, రోజుకు తనకు లక్ష ఖర్చు అవుతుందని, డీజిల్ కు కూడా డబ్బులు లేవు, ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదని శామ్యూల్ అనడం వీడియోలో వినిపించింది. లిక్కర్ సిండికేట్ ఇచ్చే మాములు తనకు టీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని, తన మాట వినని వాని సంగతి చూస్తా నంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ బెదిరించడం ఇప్పుడు వైరల్ గా మారింది. మరి దీనిపై ఎమ్మెల్యే ఎలాంటి వివరణ ఇస్తారన్నది చూడాలి. అదే సమయంలో పార్టీ అధినాయకత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదన్నది ఆసక్తికరంగా మారింది.