Rahul Gandhi : కులగణనపై రాహుల్ కామెంట్స్ ఇవీ
కులగణన అవసరం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
caste census in telangana
కులగణన అవసరం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో కులవివక్ష ఉందన్నది వాస్తవమని అన్నారు. కులగణనపై జరిగిన ప్రత్యేక సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. కుల వివక్ష కారణంగా కొందరు మాత్రమే లబ్ది పొందుతున్నారని రాహుల్ అన్నారు. కుల వివక్షను ఇప్పటి వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం నిర్మూలించడానికి ప్రయత్నించలేదని ఆయన ఆవేదన చెందారు. ఎంతమంది ఉన్నత స్థానాల్లో దళితులున్నారు? ఎంతమంది ఆదివాసీలున్నారు? ఎంత మంది బీసీలున్నారు? అంటూ తేల్చాల్సిందేనన్నారు. దేశంలో ఎంత మంది నిరుపేదలు ఉన్నారన్నది తెలుసుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు.
తెలంగాణలో తొలిసారి...
తెలంగాణలో ఈ కులగణనను ప్రారంభిస్తున్నామని రాహుల్ గాంధీ తెలిపారు. జాతీయ స్థాయిలో కులగణన చేపడతామని తాను పార్లమెంటు సాక్షిగా చెప్పానని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాస్తవాలు బయటకు రావద్దనుకునే వారే కులగణను అడ్డుకుంటున్నారని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎంతమంది ఓబీసీలు న్యాయవ్యవస్థలో ఉన్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. బ్యూరోక్రాట్లు చేసే కులగణన మనకు అవసరం లేదని ఆయన అన్నారు. అసమానతలు మనదేశంలో పెరిగిపోయాయని అన్నారు. ఏ ప్రశ్నలు అడగాలో దళితులు, బీసీలు, ఆదివాసీలు నిర్ణయంచేయాలని రాహుల్ అన్నారు.