నేడు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పాదయాత్ర

తెలంగాణలో కాంగ్రెస్‌ జనహిత పాదయాత్ర కొనసాగుతుంది.

Update: 2025-08-02 02:49 GMT

తెలంగాణలో కాంగ్రెస్‌ జనహిత పాదయాత్ర కొనసాగుతుంది. నేడు జోగిపేట డిగ్రీ కాలేజీలో శ్రమదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో పాదయాత్రలు చేసిన మీనాక్షి నటరాజన్ నేడు కూడా పాదయాత్రలో పాల్గొంటారు.

శ్రమదానం అనంతరం...
శ్రమదానంలో పాల్గొననున్న అనంతరం మీనాక్షి నటరాజన్ నిజామాబాద్‌ జిల్లాలో జరిగే పాదయాత్ర చేపట్టనున్నారు. ఆలూరు నుంచి ఆర్మూర్‌ పాత బస్టాండ్‌ వరకు యాత్రను మీనాక్షి చేపట్టనున్నారు. రాత్రికి ఆర్మూర్‌లోనే కాంగ్రెస్ నేతలు బస చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.


Tags:    

Similar News