Telangana : మొన్నటి వరకూ అమ్మో ఒకటో తారీఖు.. నేడు మాత్రం వారెవ్వా ఒకటో తేదీ

తెలంగాణాలో ఒకటోతేదీన ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు చెల్లించడం జరుగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది

Update: 2024-02-02 04:28 GMT

తెలంగాణలో కాంగ్రెెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో అనేక మార్పులు తెచ్చింది. అనేక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జారీ చేసిన తొలి ఆదేశం ఇదే కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మాత్రం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో మాదిరిగానే ప్రతి నెల ఒకటో తేదీన చెల్లించాలని రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.

చెప్పినట్లుగానే జీతాలు...
ఆయన చెప్పిన మేరకే ఒకటో తేదీన జీతాల చెల్లింపు ప్రారంభమయింది. నిన్న కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడటంతో్ వారంతా హ్యాపీగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి అని, ఈఎంఐలు కట్టుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డామని ఉద్యోగులు చెబుతున్నారు. తాజాగా ఒక ఉద్యోగి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆయన నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్వీట్ చేశారు. ఒకటోతేదీన జీతాలు రావడాన్ని తన భార్య కూడా నమ్మడం లేదని ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. సీఎంవో కార్యాలయం కూడా ఉద్యోగులకు కొన్ని జిల్లాల్లో ఒకటో తేదీన వేతనాలు అందాయని ట్వీట్ చేయడం విశేషం.
Tags:    

Similar News