Revanth Reddy : నేడు ఉస్మానియా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన
హైదరాబాద్ లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్ లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. ఉస్మానియా పాత భవనం నిజాం కాలంలో నిర్మించడంతో అది బాగా పాతపడిపోయింది. వైద్యులతో పాటు రోగులు కూడా అవస్తలు పడుతున్న నేపథ్యంలో కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావించింది.
అధునాతన సౌకర్యాలతో...
ఉదయం 11.54 గంటలకు గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపేన చేయనున్నారు. రోగులకు అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని రకాల వసతులతో పాటు వైద్యులకు కూడా నివాస భవనాలను అక్కడ నిర్మించాలని ప్రబుత్వం నిర్ణయించింది.