Revanth Reddy : వారానికి మూడు రోజులకు జిల్లాలకు
వచ్చే నెల రెండో తేదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు
public governance program of the government
వచ్చే నెల రెండో తేదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఆయన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల నేపథ్యంలో...
ఈ నెల 2వ తేదీన ఇంద్రవెల్లి నుంచి ఆయన పర్యటనలు ప్రారంభం కానున్నాయి. వారానికి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్ జిల్లా పర్యటనలు ఉండనునన్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చూడాల్సిందిగా ఇప్పటికే జిల్లా నేతలకు సమాచారం వెళ్లింది. పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని ఇంద్రవెల్లి నుంచి ప్రారంభించనున్నారు.