Revnanth Reddy : అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ ఏమన్నారంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు

Update: 2025-01-23 02:07 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. సంథ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటకు అల్లు అర్జున్ అక్కడకు రావడమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. దావోస్ లో మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు. మహిళ మృతికి అల్లు అర్జున్ నేరుగా కారణం కాకపోయినప్పటికీ పరోక్షంగా ఆయనే కారణమని పోలీసులు భావించి ఉండవచ్చని అన్నారు.

చట్టం తన పని తాను...
చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అందులో ఎలాంటి వివక్షకు తావుండదని తెలిపారు. రెండు రోజులకు ముందు అనుమతి కోసం వస్తే పోటీసులు నిరాకరించారని, అయినా సంథ్య థియేటర్ కు అల్లు అర్జున్ వచ్చారని రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు. మహిళ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని కూడా కొన్ని రోజుల పాటు పట్టించుకోలేదన్నారు. సెక్యూరిటీ సిబ్బంది తోయడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగి ఉండవచ్చని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News