Telangana : నేడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు

Update: 2025-02-21 03:39 GMT

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. నేడు వికారాబాద్, నారాయణపేట్ జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాకు బయలుదేరి వెళతారు.

వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో...
దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామంలో జరిగే రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే ఉత్సవంలో పాల్గొంటారు అనంతరం నారాయణపేట మండలం అప్పక్ పల్లికి చేరుకుని మహిళలు నిర్వహిస్తున్నపెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. ఆతర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.


Tags:    

Similar News