Revanth Reddy : ఎస్.ఎల్.బి.సి ప్రమాదంపై రేవంత్ లేటెస్ట్ గా ఏమన్నారంటే?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ పనులు 2005లో ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ పనులు 2005లో ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెస్క్యూ సిబ్బంది చిక్కుకున్న కార్మికుల ఆచూకీని కనుగొనేందుకు చేస్తున్న శ్రమ అభినందనీయమని తెలిపారు. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించిందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే 44 కిలోమీటర్ల టన్నెల్ ఇంత వరకూ ఎక్కడా లేదన్నారు.
పనులు పూర్తి చేస్తాం...
ఇది దురదృష్టకరమైన ఘటన అని తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. లోపల చిక్కుకుపోయిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, మంత్రులు, మిషన్లతో పాటు రోబోలను కూడా వినియోగించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఏ సమస్యలు రాకుండా రోబోలు లోపలికి పంపించి పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.