Revanth Reddy : గ్లాసులో సోడా పోసినంత ఈజీ కాదు గోదావరి నీళ్లను తేవడం : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు

Update: 2025-07-14 12:25 GMT

బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మూడు అడుగులు ఉన్న వ్యక్తి తనను అడ్డుకుంటానని అంటున్నారడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్కసారి అడ్డుకుని చూడు మా దామన్న చూసుకుంటాడని హెచ్చరించారు. గ్లాసులో సోడా పోసినంత ఈజీ కాదు గోదావరి నీళ్లను తేవడం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తుంగతుర్తిలోని తిరుమల గిరిలో కొత్త రేషన్ కార్డులనుప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారందరికీ తెలుపు రంగు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. పేద ప్రజలు ప్రతి రోజూ తినేలా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

రైతులు పండించే సన్నబియ్యానికి...
రైతుల పండించే సన్నబియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ క్వింటాల్ కు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. నేడు దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని అన్నారు. రైతులు ఆనందంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షింగా ఉంటుందని అన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, బోనస్ వంటి పథకాలను అందిస్తున్నామని తెలిపారు. 26 లక్షల మందికి రేషన్ కార్డుల పేర్లు మార్చుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ప్రస్తుతం 3.10 కోట్ల మంది తెలంగాణలో సన్నబియ్యం తింటున్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమయిందన్నారు. తెలంగాణ యువతకు తమ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని వేదిక నుంచిమాట ఇచ్చారు.
రైతులకు అండగా...
రైతుభరోసా నిధులను తొమ్మిది రోజుల్లోనే అందరికీ ఇచ్చామని, బీఆర్ఎస్ నేతలు ఇంటింటికి వెళ్లి ఏడ్చినా ఉపయోగం లేదన్నారు. లక్షకోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, కాంగ్రెస్ ప్రాజెక్టులు ఈరోజు వరకూ ఎలా ఉన్నాయో చర్చకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. మూడడుగుల ఆయన ఆరోజు ఎలా ఉన్నాడో.. ఈరోజు ఎలా ఉన్నాడో ఆలోచన చేయాలని అన్నారు. ఆరోజు బైకు మీద తిరిగిన ఆయన నేడు బెంజికార్లో తిరుగుతున్నాడంటే అందుకు కారణాలు ఏంటని ఆలోచించాలని అన్నారు. రైతు రాజు అయినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుందని అన్నారు. పెట్రోల్ బంకులు, సోలార్ ప్రాజెక్టులు, ఆర్టీసీ బస్సులు మహిళలకు అప్పగించామని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ నేతలు గోదావరి నీళ్లు ఎందుకు తేలేకపోయారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించడానికి తాను సిద్ధమని అన్నారు.
పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం...
ఎవరెన్ని అనుకున్నా పదేళ్లు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంటుందని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బలహీన వర్గాలకు ఇస్తామని తెలిపారు. నాలుగు ఎమ్మెల్సీ పదవుల్లో మూడు నల్లగొండ జిల్లాకే ఇచ్చామన్న రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్ల బలహీన వర్గాల వారే నేతలుగా మారతారని అన్నారు. ఈజిల్లాలో ఏకలింగం ఒక్కడూ గెలిచి ఏదేదో మాట్లాడుతున్నాడని, దేశంలో కులగణన చేసేలా ప్రధాని నరేంద్ర మోదీపై వత్తిడి తేగలగామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధి కూడా అంతే స్థాయిలో చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News