దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి

దావోస్‌ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బయలుదేరి వెళ్లారు

Update: 2026-01-19 06:40 GMT

దావోస్‌ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బయలుదేరి వెళ్లారు. సీఎంతో పాటు దావోస్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అధికారులు కూడా ఉన్నారు. ఇప్పటికే దావోస్‌లోనే ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు నేడు పలు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఏఐ, సెమీకండక్టర్స్, లైఫ్ సైన్సెస్,గ్రీన్‌ ఎనర్జీ కీలక రంగాల్లో పెట్టుబడులపై తెలంగాణ ఫోకస్‌ పెట్టనుంది.

పెట్టుబడుల కోసం...
ప్రముఖ కంపెనీల సీఈవోలను దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ కలవనున్నారు. దావోస్‌ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న రేవంత్ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీకానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకు వచ్చేందుకు ఆయన పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన తిరిగి హైదరాబాద్‌ రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు.


Tags:    

Similar News