Revanth Reddy : ఆ జిల్లాల వాసులకు గుడ్ న్యూస్.. వారికి వెంటనే రేషన్ కార్డులు
కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు
కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కో్సం అందాయన్న ముఖ్యమంత్రి వారికి వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు సిద్ధమవ్వాలని నిర్ణయించారు.
రేషన్ కార్డుల కోసం...
రేషన్ కార్డుల కోసం దశాబ్దకాలంగా లక్షలాది మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయని, అర్హులైన వారిని గుర్తించి వారికి వెంటనేరేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖపై సమీక్ష చేసిన సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోసారి దరఖాస్తులు చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను కోరారు.