రైతుబంధు నగదు ఈ నెల 28 నుంచి
రైతు బంధు పథకం నగదు ఈ నెల 28వ తేదీ నుంచి ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
రైతు బంధు పథకం నగదు ఈ నెల 28వ తేదీ నుంచి ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ నెల 28 వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం పది రోజుల్లోనే ముగించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పది రోజుల్లో నగదు అందరికీ చేరేలా కార్యాచరణను రూపొందించాలని కోరారు. భూమి ఉండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఈ నెల 28వ తేదీ నుంచి నగదు జమ అవుతుంది.
అందరికీ దక్కేలా...
రైతు బంధు పథకం త్వరగా పంపిణీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి అవసరమైన నిధుల విడుదలకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది.