Telangana : వారం రోజుల్లో రైతులకు పుష్కలంగా యూరియా
తెలంగాణ రైతంగానికి ఊరట కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపుతామని హామీ ఇచ్చింది
తెలంగాణ రైతంగానికి ఊరట కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతాంగాం యూరియా కోసం కష్టాలు పడుతున్న నేపథ్యంలో తక్షణమే 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపునకు కేంద్రం హామీ ఇచ్చింది. ఢిల్లీలో తెలంగాణ ఎంపీల ఆందోళన చేసిన రోజు ఈ హామీ లభించడం విశేషం. గుజరాత్, కర్ణాటక నుంచి తక్షణమే తెలంగాణకు యూరియా తరలించాలని ఆదేశించింది
కేంద్రం హామీతో...
అయితే వారం రోజుల్లో తెలంగాణకు యూరియా వస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 50 వేల మెట్రిక్ టన్నులు తక్షణ కేటాయింపునకు కేంద్రం అంగీకరించిందని మంత్రి తుమ్మల చెప్పారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడంతో రైతాంగం యూరియా కోసం సహకారసంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.