Telangana : ఉచిత బస్సు ప్రయాణంపై నేడు సంబురాలు
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్యాలయాల్లో సంబురాలు చేయనుంది.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్యాలయాల్లో సంబురాలు చేయనుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో ఉచిత బస్సు పథకం ద్వారా రెండు వందల కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. దీంతో తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో సంబురాలు చేయాలని నిర్ణయించింది.
200 కోట్ల మంది...
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించడంతో అత్యధికంగా మహిళలు ప్రయాణించడంతో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో సంబురాలు నిర్వహించనున్నారు. రోజుకు ముప్ఫయి లక్షల మంది ఉచిత ప్రయాణాలు చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.