చికోటి ప్రవీణ్ మీద ఇంత అభిమానమా?

గతంలో కర్మాన్‌ ఘాట్‌లో చికోటి ప్రవీణ్‌ బర్త్‌ డే వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ

Update: 2023-07-12 04:56 GMT

చికోటి ప్రవీణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయిన పేరు. అతడిపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినీప్రముఖులతోనూ, పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులతోనూ సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లోని కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు ఇలా ఎంతో మంది చికోటి ప్రవీణ్ కు బాగా పరిచయం. ఒకప్పుడు హైదరాబాద్‌, సైదాబాద్‌లో సిరామిక్‌ టైల్స్‌ వ్యాపారం చేసిన చికోటి ప్రవీణ్.. ఆ తర్వాత సినిమాలంటే ఆసక్తి ఉండడంతో.. నిర్మాతగా మారి సినిమాలు కూడా తీశాడు. ఏకంగా నటుడిగా కూడా అవతారం ఎత్తాడు. కలిసి రాకపోవడంతో క్రైమ్ ను మార్గంగా ఎంచుకున్నాడు. గోవాలో ఓ పేకాట క్లబ్‌లో కొన్ని టేబుళ్లను అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తూ వచ్చాడు. క్యాసినో కింగ్ గా మారి కోట్లకు పడగలెత్తాడు. జంట నగరాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినో నిర్వహించాడని చెబుతారు. 2014 తర్వాత తన చీకటి వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు విస్తరించేశాడని కూడా అంటారు. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్‌కు కస్టమర్లను తీసుకెళ్లి కోట్ల రూపాయలతో పేకాట ఆడించిన ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి.

ఇక ఆయనకు అభిమానులు కూడా ఉన్నారని తాజాగా స్పష్టమైంది. ఆయన పుట్టినరోజు నాడు ఎంతో మంది పలు పేపర్లలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ పేజీ మొత్తం యాడ్ ఇచ్చారు. ధర్మాన్ని రక్షించే వ్యక్తిగా.. స్నేహానికి విలువను ఇచ్చే మనిషిగా ప్రవీణ్ ను పొగుడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దీన్ని చూసి ఎంతో మంది నెటిజన్లు షాక్ అవుతూ ఉన్నారు. ఇక ఆయన పుట్టినరోజు వేడుకలు భారీగానే జరుగుతాయని అంటూ ఉన్నారు.
గతంలో కర్మాన్‌ ఘాట్‌లో చికోటి ప్రవీణ్‌ బర్త్‌ డే వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ అవాక్కయ్యారు. బర్త్‌డే పార్టీకి ప్రత్యేకంగా పాఠల సీడీనే విడుదల చేశారు. క్యాసినో కింగ్‌ మేకర్‌గా ఉన్న చికోటి గతంలో అనేకసార్లు పోలీసులకు పట్టుబడిన సందర్భాలు ఉన్నా.. ఆయనకు ఫాలోవర్స్ విషయంలో మాత్రం కొదవ లేదని అంటున్నారు. ప్రవీణ్ తన బర్త్‌డే కోసం గతంలో రూ.5 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఈడీకి సమాచారం అందింది. ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. ఇక ఈ ఏడాది ఏ స్థాయిలో ప్రవీణ్ పుట్టినరోజును నిర్వహిస్తారో అని చర్చించుకుంటూ ఉన్నారు.


Tags:    

Similar News