అలాంటి వ్యాఖ్యలు చేస్తే.. రియాక్షన్ ఇలానే ఉంటుంది

హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు

Update: 2023-11-29 09:39 GMT

హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భావోద్వేగ ప్రసంగం చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని కమలాపూర్ ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్రకు వస్తానని, లేదంటే నాలుగో తేదీన మా ముగ్గురి శవయాత్రకు మీరు రావాల్సి వస్తుందని, ఏ యాత్రకు వస్తారో మీరు నిర్ణయించుకోవాలని ప్రజలను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అన్నారు.

పాడి కౌశిక్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సీరియస్‌గా పరిగణించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్‌రెడ్డి నిన్న తన భార్య, కుమార్తెతో కలిసి హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో రోడ్‌షో నిర్వహించారు.తనను గెలిపించకుంటే కుటుంబమంతా కలిసి కమలాపూర్ బస్టాండ్‌లో ఉరేసుకుంటామని అన్నారు. తనకు ఓటేసి గెలిపించకుంటే ముగ్గురు శవాలను చూడాల్సి వస్తుందన్నారు. ఓటేసి దీవిస్తే జైత్రయాత్రకు వస్తానని, లేదంటే 4న తన శవయాత్రకు రావాలని వ్యాఖ్యలు చేశారు.


Tags:    

Similar News