Telangana : నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చంచనున్నారు

Update: 2025-10-16 02:04 GMT

తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చంచనున్నారు. సచివాలయంలో జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు.

ప్రధానంగా చర్చించే...
బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీర్పుపై తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఏం చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా? లేక సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత దానిపై దృష్టి పెట్టాలా? అన్న అంశాన్ని ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. దీంతో పాటు రబీ సీజన్ లో రైతులకు సంబంధించిన విషయాలపై మంత్రివర్గ సమావేశం చర్చించనుంది. పత్తి కొనుగోళ్లపైనా కూడా సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది.


Tags:    

Similar News