KTR : లోకేశ్ ను కలిస్తే తప్పేంటన్నకేటీఆర్

ఆంధప్రదేశ్ మంత్రి లోకేష్‌ను తాను కలవలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు

Update: 2025-07-18 12:08 GMT

ఆంధప్రదేశ్ మంత్రి లోకేష్‌ను తాను కలవలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అయినా కలిసినా తప్పేంటి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. లోకేష్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, లోకేష్‌ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. రేవంత్‌ ప్రెస్‌మీట్‌కు యువత దూరంగా ఉండాలను సూచించారు. రేవంత్ పిరికి సన్నాసి అని, చర్చకు రమ్మంటే పారిపోతున్నాడని ఫైరయ్యారు. రేవంత్‌రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారన్న కేటీఆర్ చిట్‌చాట్‌లో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్‌లా తాను దొంగను కాదని.. సంచులు మోయలేదని ఎద్దేవా చేశారు.

బనకచర్లపై చంద్రబాబు...
బనకచర్లపై చంద్రబాబును కలవబోనని చెప్పి ఢిల్లీలో కలిసి దొరికిపోయారని అన్నారు. గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పజెప్పి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో దొరికిన దొంగ అటెన్షన్ డైవర్షన్ కోసమే పిచ్చివాగుడు వాగుతున్న ముఖ్యమంత్రి పై నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి తప్పు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. తన ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడుతున్నారనే భయంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేయించడం లేదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఆధారాలతో సహా అన్నీ బయటపెడతా అని అన్నారు.


Tags:    

Similar News