BRS : నేడు కారు పార్టీ జంగ్ సైరన్
నేడు బీఆర్ఎస్ రైతు దీక్ష జరగనుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రైతు దీక్షను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
నేడు బీఆర్ఎస్ రైతు దీక్ష జరగనుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రైతు దీక్షను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈరైతు దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. జంగ్ సైరన్ పేరుతో రైతు దీక్షను బీఆర్ఎస్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు బీఆర్ఎస్ నేతలు పూర్తి చేశారు.
రైతు సమస్యలపై...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది గడుస్తున్నా రైతు సమస్యలను పట్టించుకోలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఈ ఆందోళనకు దిగనుంది. రైతులకు రుణమాఫీ సక్రమంగా చేయలేదని, రెండు లక్షల రుణమాఫీ కొందరికే చేశారని, అలాగే రైతు భరోసా పథకాన్ని కూడా అందరికీ వర్తింప చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఈ రైతు దీక్షను బీఆర్ఎస్ నేతలు చేయనున్నారు.