కేసులకు భయపడేది లేదు : కవిత

అక్రమ కేసులతో వేధిస్తే మేం భయపడబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు

Update: 2025-06-17 02:13 GMT

అక్రమ కేసులతో వేధిస్తే మేం భయపడబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులిచ్చి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆమె అన్నారు. తమ పార్టీలో లోపాలను సవరించుకుంటామన్న కల్వకుంట్ల కవిత తమపై ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని చెప్పారు.

ప్రజల ఆలోచనలను మళ్లించడానికే...
ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసిందని, కాంగ్రెస్ హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇచ్చిన హామీల నుంచి ప్రజల ఆలోచనల నుంచి మళ్లించడానికే ఇలా విచారణ పేరులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డ్రామా లాడుతుందని కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News