Breaking : కవిత మరో సంచలన లేఖ.. కుట్ర జరుగుతుందంటూ?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి బహిరంగ లేఖ రాశారు.అందులో సంచలన విషయాలను ప్రస్తావించారు

Update: 2025-08-21 06:56 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి బహిరంగ లేఖ రాశారు. సింగరేణి కార్మిక సంఘం నుంచి తనను తొలగించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను తాను బయటపెట్టడమే తనపై ఈ కక్ష సాధింపు చర్యలు అని అన్నారు. టీజీబీకేఎస్ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తాను అమెరికా వెళ్లినప్పుడు తొలగించడమేంటని కవిత ప్రశ్నించారు. ఆ కుట్రదారులే తనను అన్ని రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని కవిత ఆరోపించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ తనను తొలగించడంపై ఆమె తీవ్రంగా ఆక్షేపించారు.

అమెరికాకు వెళ్లినప్పుడే...
గతంలో తాను అమెరికాకు వెళ్లినప్పుడు గతంలో పార్టీ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖను బయటపెట్టారని, ఇప్పుడు కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగించారని కవిత ఆరోపించారు. గతంలో తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టాలో చెప్పాలని తాను ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నానని అన్నారు. తనపై కుట్ర జరుగుతుందని, తాను అమెరికాకు వెళ్లినప్పుడే పదవి నుంచి తొలగించడం కుట్రలో భాగమేనని అన్నారు. కార్మిక సంఘం సమావేశం బయట జరగాలని అయితే తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేయడమేంటని లేఖలో ప్రశ్నించారు. అమెరికా పర్యటనలో ఉన్న కల్వకుంట్ల కవిత మరోసారి బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది.


Tags:    

Similar News